
పవన్ కళ్యాణ్ దూకుడు మాములుగా లేదు. షూటింగ్ లకు పెద్దగా గ్యాప్ ఇవ్వడం లేదు. ఇప్పటికే “బ్రో” సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి చేశారు పవన్ కళ్యాణ్. మిగిలిన బ్యాలెన్స్ వర్క్ ఈ నెలాఖరులో పూర్తి చేస్తారు.
ఇక ఈ రోజు నుంచి (మే 18) మళ్ళీ షూటింగ్ తో బిజీగా మారిపోయారు పవన్ కళ్యాణ్. ఆయన ప్రస్తుతం సుజీత్ డైరెక్ట్ చేస్తున్న “ఓజీ” షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇప్పటికే “ఓజీ” కోసం ముంబైలో కొన్నాళ్ళూ, పూణేలో కొన్ని రోజులు షూటింగ్ లో పాల్గొన్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ మొదలైంది.
అన్ని అనుకున్నట్లు జరిగితే, ఈ ఏడాది “బ్రో” (జులై 28), “ఓజీ”లు విడుదలవుతాయి. ఈ రెండు సినిమాల విషయంలో పవన్ కళ్యాణ్ చాలా డెడికేషన్ చూపిస్తున్నారు.
ఇక “హరి హర వీర మల్లు”, “ఉస్తాద్ భగత్ సింగ్” షూటింగ్ లు మాత్రం ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి.
ALSO CHECK: Bro: Title and first look motion poster unveiled