
పవన్ కళ్యాణ్ తన టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే రాజకీయాల్లో కూడా రోడ్ మ్యాప్ క్రియెట్ చేసుకున్నారు. “2024లో జనసేనదే అధికారం. 7 శాతం ఓటింగ్ నుంచి ఇప్పుడు 27 శాతానికి చేరాం. పవర్ లోకి వచ్చి తీరుతాం,” అని ప్రకటించారు పవన్ కళ్యాణ్.
జనవరి 14… జనసేన ఆవిర్భావ దినోత్సవం. తాడేపల్లి మండలం ఇప్పటంలో నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. భారీగా కార్యకర్తలు వచ్చారు. వారిని ఉద్దేశించి ప్రసంగించిన పవన్ కల్యాణ్ 2024లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమాగా చెప్పారు.
“భవిష్యత్ కార్యకర్తల చేతుల్లో ఉంది. నేను నడిచి చూపిస్తా. ఎమర్జెన్సీ సమయంలో ఎంతోమంది యువకులు రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు మరోసారి అలాంటి అవకాశం వచ్చింది. మీరు నాతో కలిసి అడుగులు వేయండి,”అని ఆయన కార్యకర్తలను కోరారు.
పవన్ కళ్యాణ్ మరి ఈ రెండేళ్ల కాలంలో సినిమాలు, రాజకీయాలు ఎలా బైలెన్స్ చేస్తారో చూడాలి.