
‘గబ్బర్ సింగ్’ పవన్ కళ్యాణ్ అభిమానులకు చాలా ఇష్టమైన చిత్రం. అది అప్పట్లో పెద్ద హిట్. ఒక సంచలనం. దశాబ్దం తరువాత పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు.
బుధవారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి వేసిన పోలీస్ స్టేషన్ సెట్ లో మొదటి సీన్ తీశారు. ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర ముఖ్య తారాగణం పాల్గొననున్నారు. పవన్ కళ్యాణ్ కి జోడీగా శ్రీలీల నటిస్తోంది.
‘గబ్బర్ సింగ్’లో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా నటించారు. ఈ ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో కూడా అదే రోల్. టైటిల్ లో సింగ్ కామన్, పాత్ర కూడా సేమ్ పోలీసే.

ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అశుతోష్ రాణా, నవాబ్ షా, కేజీఎఫ్ అవినాష్, గౌతమి, నర్రా శ్రీను, నాగ మహేష్, టెంపర్ వంశీ నటిస్తున్నారు.