
పవన్ కళ్యాణ్ ఈ ఏడాది ఫిబ్రవరి మొదటివారంలో ‘భీమ్లానాయక్’ షూటింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత తన రాజకీయ పార్టీ (జనసేన) కార్యకలాపాలతో బిజీ అయిపోయారు. ఇక మళ్ళీ సినిమా షూటింగ్ లకు రెడీ కావాల్సిన తరుణం ఆసన్నమైంది. ఎందుకంటే, ఆయన ఒప్పుకున్న చిత్రాల లిస్ట్ పెద్దది. 2024 ఎన్నికలలోపు అన్ని పూర్తి చెయ్యాలి.
ప్రస్తుతం విదేశీ పర్యటనలో పవన్ కళ్యాణ్ ఏప్రిల్ మొదటి వారంలో కొత్త సినిమాల సెట్స్ పైకి వెళ్తారని టాక్.
ముందుగా ఆయన ‘హరి హర వీరమల్లు’ చిత్రం షూటింగ్ మొదలుపెడుతారు. ఆ తర్వాత ‘వినోదయా సితం’ అనే తమిళ్ చిత్రం తెలుగు రీమేక్ లో నటిస్తారు. ఈ సినిమాకి సముద్రఖని దర్శకుడు. త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే రాస్తున్నారు. పవన్ తో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా హీరోగా నటించే చిత్రం ఇది.
ఈ రెండు సినిమాలు వచ్చే నెలలోనే ప్రారంభం అవుతాయి. ఇవి పూర్తయిన తర్వాతే మిగతా సినిమాల గురించి ఆలోచిస్తారు.