దెబ్బకి సారీ చెప్పనున్న పాయల్

Payal Ghosh

మొన్నటి వరకు ఒక వర్గం మీడియా అండతో కొందరు హీరో, హీరోయిన్లు తెగ రెచ్చిపోయారు. బాలీవుడ్ ప్రముఖలపై ఇష్టారాజ్యంగా కామెంట్స్ చేశారు. ఆరోపణలు గుప్పించారు. ఈ రోజు బొంబాయి కోర్టు కొరడా ఝళిపించడంతో వీరందరికి జేజమ్మ కనపడుతోంది. ఇప్పటికే రియా చక్రబర్తికి కోర్టు బెయిల్ ఇచ్చింది. రియా మీద చేసిన చాలా ఆరోపణల్లో పస లేదని కోర్టు స్పష్టంగా చెప్పింది.

ఇక… పాయల్ ఘోష్ కి కూడా కోర్టు చుక్కలు చూపించింది. దాంతో అమ్మడు కాళ్లబేరానికి వచ్చింది.

ఇంతకీ మేటర్ ఏంటంటే….

దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనని లైంగికంగా వేధించాడని ఆరోపణలు చేసింది. ఒక వీడియోలో ఈ ఆరోపణలు చేసింది. కశ్యప్ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు తన జిప్ విప్పి తన బాడీపై పడ్డాడు అని చెప్పింది. ఈ ఆరోపణలకు సంబంధించి పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. అది నడుస్తోంది. ఐతే, అదే వీడియోలో ఆమె రిచా చద్దా, హ్యూమా ఖురేషి వంటి ఇతర హీరోయిన్లపై కూడా కామెంట్ చేసింది. ఆ కామెంట్లు ఆమెని కోర్టుకు లాగాయి. రిచా, హ్యూమా, మహి గిల్ వంటి హీరోయిన్లు తనతో పడుకున్నారు అని అనురాగ్ కశ్యప్ చెప్పాడని పేర్కొంది పాయల్ ఘోష్. దాంతో పాయల్ ని, పాయల్ కామెంట్స్ ని చిలువలు పలువలుగా చేసి ప్రసారం చేసిన ఛానెల్స్ ని, కె.ఆర్.కె అనే జర్నలిస్ట్ ని కోర్టుకు లాగింది రిచా.

తన పరువు తీసేందుకు ప్రయతించిన వీరు తమ ఆరోపణలు నిరూపించుకోవాలని రిచా బాంబే హైకోర్టులో కేసు వేసింది. ఈ రోజు కేసు విచారణకి వచ్చింది. దెబ్బకి పాయల్ ఘోష్ …తాను “ఎదో క్యాజువాల్” అన్నాను అని కోర్టుకి చెప్పింది. అంతే కాదు, రిచాకి క్షమాపణలు చెప్తాను అని కోర్టుకు విన్నవించుకొంది.

Related Stories