టాలీవుడ్ వదిలేసి తప్పు చేశా

Payal Ghosh

ఉత్తరాది నుంచి వచ్చిన ముద్దుగుమ్మలందరికీ బాలీవుడ్ అనేది ఓ డ్రీమ్. టాలీవుడ్ లో వాళ్లు సినిమాలు చేస్తున్నప్పటికీ.. బాగా క్రేజ్-డబ్బు సంపాదిస్తున్నప్పటికీ వాళ్ల చూపు ఎప్పుడూ హిందీ సినిమాలవైపే ఉంటుంది. సౌత్ లో స్టార్ హీరోలు ఆఫర్లు ఇచ్చినా వీళ్లకు తృప్తి ఉండదు.. బాలీవుడ్ లో ఓ చిన్న సి-గ్రేడ్ సినిమాలోనైనా నటించేయాలి. అదీ వీళ్ల టార్గెట్.

ఇలా దూరపు కొండలు చూసి నునుపు అనుకునే హీరోయిన్లకు గట్టిగా కౌంటర్ ఇచ్చింది పాయల్ ఘోష్. ఊసరవెల్లి, ప్రయాణం లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్ అసలు రంగును బయటపెడుతూనే, టాలీవుడ్ ఎంత గొప్పదో చెబుతోంది.

Also Check: Payal Ghosh Gallery

సౌత్ లో హీరోయిన్లకు గుళ్లు కడతారని, అదే బాలీవుడ్ లోనైతే చచ్చిపోయేంత వరకు అవమానిస్తూనే ఉంటారని ఆరోపిస్తోంది పాయల్. బాలీవుడ్ కోసం టాలీవుడ్ ఆఫర్లు వదులుకొని చాలా పెద్ద తప్పు చేశానని, ఇకపై ఎవ్వరూ ఆ తప్పు చేయొద్దని అంటోంది. మరీ ముఖ్యంగా సౌత్ హీరోయిన్లంతే బాలీవుడ్ జనాలకు చాలా చులకన భావం ఉందని, సౌత్ హీరోయిన్లు దేనికైనా ఓకే అంటారనే భావన బాలీవుడ్ లో బాగా ఉందని చెబుతోంది.

బాలీవుడ్ ఆఫర్ల కోసం వెంపర్లాడే హీరోయిన్లు ఈ విషయాన్ని కాస్త తెలుసుకుంటే మంచిది.

Related Stories