
తన డేటింగ్ విశేషాలు బయటపెట్టింది ఒకప్పటి హీరోయిన్ పాయల్ ఘోష్. గతంలో తను ఓ క్రికెటర్ తో డేటింగ్ చేశానని తెలిపింది. అయితే ఆ క్రికెటర్ పేరు మాత్రం బయటకు చెప్పలేదు. ఆ డేటింగ్ వ్యవహారం సుఖాంతమైతే బాగుండేదని, అది తనను డిప్రెషన్ కు గురిచేసిందని చెప్పుకొచ్చింది.
దాదాపు 12 ఏళ్ల కిందట ఓ క్రికెటర్ తో ప్రేమాయణం సాగించిందట పాయల్. కానీ అది మధ్యలోనే బ్రేకప్ అయిందని చెప్పుకొచ్చింది. ఆ టైమ్ లో తను డిప్రెషన్ కు లోనయ్యానని, ఆత్మహత్య ఆలోచనలు బాగా వచ్చేవని చెప్పుకొచ్చింది. నెల రోజులు బాధపడిన తర్వాత ముంబయిలోని కోకిలాబెన్ హాస్పిటల్ కు వెళ్లి ట్రీట్ మెట్ తీసుకున్నానని.. పూర్తిగా డిప్రెషన్ నుంచి బయటపడ్డానికి తనకు ఏడాది పట్టిందని చెప్పుకొచ్చింది పాయల్.
ఆ క్రికెటర్ కు ఇప్పటికీ స్టార్ స్టేటస్ ఉందని, ప్రస్తుతం క్రికెట్ తో సంబంధం కూడా ఉందని, పెళ్లయి పిల్లలు కూడా ఉన్న అతడి పేరును బయటపెట్టడం తనకు ఇష్టంలేదంటోంది పాయల్.