పాయల్ టాలీవుడ్ కనెక్షన్

పాయల్ టాలీవుడ్ కనెక్షన్

ప్రస్తుతం పాయల్ ఘోష్ కు టాలీవుడ్ కు ఎలాంటి సంబంధం లేదు. ఆమె ఇక్కడ సినిమాలు చేయడం లేదు. తెలుగులో “ప్రయాణం”, “ఊసరవెల్లి” సినిమాలతో ఆమె కెరీర్ క్లోజ్ అయింది. అయితే తను సినిమాలు చేయకపోయినా టాలీవుడ్ లో రెగ్యులర్ గా టచ్ లోనే ఉన్నానంటోంది ఈ బ్యూటీ. కొంతమంది హీరోహీరోయిన్లపై తన అభిప్రాయాల్ని వ్యక్తంచేసింది.

– మహేష్ బాబు
మహేష్ బాబు అంటే చాలా చాలా ఇష్టం. ఆయన చేసిన “దూకుడు” సినిమా నా ఫేవరెట్.

– రామ్ చరణ్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే
చరణ్ చాలా హాట్. చరణ్ చేసిన “ఎవడు” సినిమా నా ఫేవరెట్

– ఎన్టీఆర్
సూపర్ టాలెంట్ యాక్టర్. కేవలం సూపర్ స్టార్ మాత్రమే కాదు, మంచి మనిషి కూడా. ఓసారి బ్యాంకాక్ లో సాంగ్ షూట్ చేస్తున్నాం. రోడ్డుపైనే షూటింగ్. డ్రెస్ మార్చుకోవడానికి నాకోసం రోడ్డుపైనే చిన్న టెంట్ లాంటిది ఏర్పాటుచేశారు. అది చూసి తారక్ ఒప్పుకోలేదు. నిర్మాతలతో గట్టిగా మాట్లాడాడు. అమ్మాయిలకు తారక్ ఇచ్చే గౌరవం ఆ రేంజ్ లో ఉంటుంది.

– పవన్ కల్యాణ్
నాకు ఆయన ఎప్పుడూ మంచి సలహాలే ఇచ్చారు. గ్రేట్ మేన్. ఎప్పుడూ రుణపడి ఉంటాను.

– నాగార్జున
నాగ్ సర్ అంటే నాకు చాలా గౌరవం.

– తమన్న
ఆమె నా డార్లింగ్. అంతకంటే ఆమె గురించి ఏం చెప్పను.

పాయల్ టాలీవుడ్ కనెక్షన్

Check: Payal Ghosh Photos

– ప్రభాస్
టాలీవుడ్ ఇండస్ట్రీకి న్యూ సల్మాన్ ఖాన్ లాంటోడు ప్రభాస్. బాహుబలి తర్వాత ఇండియా మొత్తం అతడంటే క్రేజీగా ఫీల్ అవుతోంది. అతడు టెర్రిఫిక్.

– బాలకృష్ణ
బాలకృష్ణ గారిని కలిసి చాలా రోజులైంది. ఎప్పుడు మేం కలుసుకున్నా ఆయన నుంచి జీవితానికి సంబంధించి కొత్త విషయాలు నేర్చుకుంటాను.

– చిరంజీవి
ఆయన ఆశీర్వాదం నాకు కావాలి. ఆయనపై ఉన్న గౌరవాన్ని మాటల్లో చెప్పలేను.

– నాని
నాకు మంచి ఫ్రెండ్. తొలిసారి మేం కలుసుకున్నప్పుడు “ప్రయాణం” సినిమా గురించి మాట్లాడాడు. ఆ సినిమాతో తను, తన ఫ్రెండ్ నాకు ఫ్యాన్స్ అయిపోయామని చెప్పాడు. నాని ఫ్రెండ్ ఇంట్లో నా పోస్టర్లు కూడా ఉన్నాయని చెప్పాడు. మంచి అబ్బాయి.

 

More

Related Stories