గుండు కొట్టించుకుంటా: పాయల్

Payal Rajput

క్యారెక్టర్ కోసం అవసరమైతే గుండు కొట్టించుకోవడానికి కూడా రెడీ అంటూ ప్రకటించింది పాయల్ రాజ్ పుత్. ఈ విషయంలో రెండో ఆలోచనకు తావులేదని, పాత్ర కోసం ఏదైనా చేస్తానని చెప్పుకొచ్చింది. మరోవైపు త్వరలోనే తను విలన్ పాత్రలో కూడా కనిపించే అవకాశం ఉందని కూడా ప్రకటించింది. పాయల్ తో ఫటాఫట్ చిట్ చాట్

– నెక్ట్స్ ఫొటో షూట్ ఎప్పుడు?
నెక్ట్స్ ఫొటో షూట్ కు వెళ్లాలనే ఉంది. కానీ కరోనా వల్ల భయంగా ఉంది

– ఎత్తు
నా ఎత్తు 5 అడుగుల 8 అంగుళాలు.

– బలాలు, బలహీనతలు
బలాలు – నిజాయితీ, నిబద్ధత, స్వీయనియంత్రణ, నిత్యవిద్యార్థి. బలహీనతలు – చాలా సెన్సిటివ్, ఇంట్రోవర్ట్, ఈజీగా అందర్నీ నమ్మేస్తాను, లేటెస్ట్ టెక్నాలజీని వెంటనే ఫాలో అవ్వలేను.

– పెంపుడు జంతువుల పేర్లు
నా పెంపుడు జంతువుల పేర్లు – బన్నీ, క్యాండీ (ఒకటి కుక్క, ఇంకోటి పిల్లి)

– ఇనస్టాగ్రామ్, టిక్ టాక్ లో ఏదిష్టం.
ఇనస్టా, టిక్ టాక్ లో ఇనస్టానే ఇష్టం.

Payal Rajput

– పాత హీరోలతో ఎందుకు సినిమాలు చేస్తున్నారు?
పాత హీరోలతో ఎందుకు చేయకూడదు.. ఓల్డ్ హీరోలతో చేస్తే నన్ను బ్యాన్ చేస్తారా?

– గ్లామర్ సీక్రెట్?
ఆనందం లేకుండా అందం ఉండదు. ఆనందంగా ఉండడం ఓ కళ. అదే నా బ్యూటీ సీక్రెట్.

– బాలీవుడ్ కు ఎప్పుడు?
టాలీవుడ్ ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ-గౌరవంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాను. నేను ఇక్కడే కంటిన్యు అవుతాను.

– మాతృభాష?
మాతృభాషలు నాకు రెండు.. హిందీ, పంజాబీ

– పదో తరగతి, ఇంటర్మీడియట్ లో మార్కులు?
పదో తరగతి 72 శాతం మార్కులు.. ఇంటర్మీడియట్ లో 64శాతం మార్కులొచ్చాయి. చదువులో నేను కొంచెం వీక్.

– విలన్ గా నటించే అవకాశం ఉందా..?
త్వరలోనే ఆ గుడ్ న్యూస్ వింటారు.

– గుండుతో నటించే సత్తా ఉందా?
పాత్ర డిమాండ్ చేస్తే గుండుతో నటించడానికి అస్సలు వెనకాడను. ఈ విషయంలో రెండో ఆలోచన కూడా లేదు.

– వెజ్ లేదా నాన్-వెజ్?
నేను పక్కా వెజిటేరియన్

– బయోపిక్ ఛాన్స్ వస్తే?
బయోపిక్ ఛాన్స్ వస్తే శ్రీదేవి పాత్రలో నటించాలని ఉంది. బయోపిక్ లో నటించే అవకాశంతో పాటు, నాకే ఎంచుకునే ఛాన్స్ వస్తే కచ్చితంగా శ్రీదేవి జీవిత చరిత్రను ఎంచుకుంటాను. సినిమా రంగంలో శ్రీదేవి ఓ మేజిక్.

Also Check: Payal Rajput Photos

Related Stories