గుండె తరుక్కుపోతోంది: పాయల్

- Advertisement -

రెండో వేవ్ లో కరోనా ఏ కుటుంబాన్నీ వదలడం లేదు. అందరూ వారి ఆప్తుల గురించి ఎదో ఒక విషాదకర వార్తని వింటున్నారు. హీరోయిన్ పాయల్ రాజపుత్ కూడా తమ సన్నిహితుల్లో ఒకరిని కోల్పోయింది. కరోనా బలి తీసుకొందట. ప్రస్తుత పరిస్థితి చూస్తే మాటలు రావడం లేదని చెప్తోంది పాయల్.

నిత్యం హాట్ హాట్ ఫోటోలు అప్డేట్ చేసి కుర్రాళ్లకు ఆనందం కలిగించే పాయల్ ఈ రోజు బాధగా పోస్ట్ పెట్టారు.

‘‘ఏడవాలని అనిపిస్తోంది… మాటలు కూడా రావడం లేదు. ఆప్తులను కోల్పోయాను. ఈ కరోనా సంక్షోభంలో సొంతవారిని కోల్పోయిన వారినందరిని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది,” అని పోస్ట్ చేశారు పాయల్.

ఒకరికి ఒకరు అండగా ఉండాల్సిన టైం ఇది అని తన అభిమానులను కోరింది పాయల్ రాజపుత్.

 

More

Related Stories