
పాయల్ రాజపుత్ ఇప్పుడు లైంలైట్ లో లేదు. కరోనా తర్వాత బాగా ఫేడ్ అవుటైన హీరోయిన్లలో ఒకరు …పాయల్. అంతకుముందు ఒకటో రెండో పెద్ద సినిమాలు దక్కేవి ఆమెకి. కానీ ఇప్పుడు ఆమెని ప్రధాన పాత్రలకు తీసుకునే ఆలోచనలో లేరు ఫిలిం మేకర్స్.
ఈ అమ్మడు కూడా హీరోయిన్ పాత్రలు కోసం పట్టుబడకుండా వచ్చిన సినిమా అవకాశాలను, ఇతర ఆదాయ మార్గాలను అందిపుచ్చుకొని వెళ్తోంది.
ప్రస్తుతం ఆమె మంచు విష్ణు హీరోగా రూపొందుతోన్న సినిమాలో ఒక హీరోయిన్ గా నటిస్తోంది.
పాయల్ రాజపుత్ బాయ్ ఫ్రెండ్ వల్లే ఆమెకి అవకాశాలు తగ్గాయి అనేది ఒక వాదన. కానీ, ఆమె అలాంటి కామెంట్స్ ని పట్టించుకోవడం లేదు. అతని వల్లే ఆఫర్లు రావట్లేదు అన్న మాటని ఆమె నమ్మడం లేదు. బాయ్ ఫ్రెండ్ ని తన సినిమా సెట్స్ కి తీసుకొస్తూనే ఉంది. ఆమె కెరియర్ లో అతని పాత్ర ఉందట. తన బాయ్ ఫ్రెండ్ వల్ల ఇతరులకు సమస్య ఏంటి అని ప్రశ్నిస్తోంది. మరి, ఇతన్ని పెళ్లి చేసుకుంటుందా అనేది చూడాలి.
ALSO CHECK: Payal Rajput in a baby pink outfit