పాయల్ పేరు మరోసారి

- Advertisement -
Payal Rajput


‘బిగ్ బాస్ 5’ త్వరలోనే మొదలుకానుంది. ఆగస్టులో స్టార్ట్ అయ్యే ఛాన్సుంది. ఈ సారి ఎవరు కంటెస్టెంట్లుగా పాల్గొంటారనే విషయంలో అప్పుడే చర్చ మొదలైంది. ఇప్పటివరకు బిగ్ బాస్ టీం ఏ హీరోయిన్ని, హీరోని ఖరారు చెయ్యలేదు. కానీ పాయల్ రాజపుత్ ఓకే చెప్పింది అంటూ ప్రచారం ఊపందుకొంది.

గతంలో కూడా పాయల్ పేరు వినిపించింది. అప్పుడే తనకు బిగ్ బాస్ లో ఎంట్రీ ఇవ్వాలని లేదు పాయల్. మరి ఈ 5వ సీజన్ లో పాల్గొంటుందా? ఉత్త ప్రచారమేనా?

Payal

‘బిగ్ బాస్ 5’లో కొంత పేరున్న స్టార్స్ ని తీసుకోవాలని ప్రయత్నిస్తున్న మాట నిజమే. గతేడాది ‘స్టార్’లు పెద్దగా లేరు. కొత్తవాళ్లే ఎక్కువ. ఈ సారి గ్లామర్ కోటాలో ఏ భామ అడుగుపెడుతుందో చూడాలి.

పాయల్ రాజ్ పుత్ కి ప్రస్తుతం సినిమాల్లో ఆఫర్లు తగ్గాయి. ఆమె ఒప్పుకుంటే బాగానే ఉంటుంది. కానీ ‘బిగ్ బాస్’లోకి వెళ్లిన వారికి కెరియర్ బాగుపడ్డట్లు ఉదాహరణలు లేవు. సో, పాయల్ ఆ రిస్క్ తీసుకుంటుందా?

 

More

Related Stories