పాయల్ కి కిడ్నీ సమస్య!

హీరోయిన్ పాయల్ రాజపుత్ చేతికి ఐవి ఫ్ల్యూయెడ్స్ పెట్టుకొని షూటింగ్ లో పాల్గొంది. సినిమాలో ఒక సన్నివేశం కోసం అలా చెయ్యలేదు. ఆమెకి నిజంగానే హెల్త్ బాగాలేదు. దాంతో, ఐవి ద్వారా ఫ్లూయిడ్స్ తీసుకుంటేనే ఒక సినిమా షూటింగ్ లో పాల్గొంది. ఆ విషయాన్నీ ఆమె తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలియచేసింది.

ఆమె ఎక్కువగా నీళ్లు తాగాదంట. దాంతో, కిడ్నీ సమస్య వచ్చింది.

ఆమె రాసుకున్న మేటర్ ఇది: “నీళ్లు ఎక్కువగా తాగకపోవడంతో కిడ్నీ ఇన్ఫె క్షన్ కి గురైంది. అందరూ నీరు ఎక్కు వగా తాగాలని మీకు గుర్తుచేస్తున్నా . ప్రస్తుతం యాంటిబయోటిక్స్ తీసుకుంటూ షూటింగ్ లో పాల్గొంటున్నా. తగ్గిపోతోంది. ఎన్ని సమస్యలున్నా మన పని ఆపొద్దు. అందుకే షూటింగ్ కి హాజరయ్యాను.”

ఆమె ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని రామచంద్రాపురం వద్ద షూటింగ్ లో పాల్గొంటోంది. “మంగళవారం” అనే సినిమాల్లో నటిస్తోంది. ఆమె ఖాతాలో “RX 100”, “వెంకీ మామ” వంటి హిట్స్ ఉన్నాయి.

Advertisement
 

More

Related Stories