ఇంకోటి ఒప్పుకున్న రష్మిక

బాలీవుడ్ మోజులో పడి తెలుగు సినిమాలు తగ్గించింది రష్మిక. ఐతే, ఆమెకి బాలీవుడ్ లో పెద్దగా విజయాలు దక్కలేదు. ఆమె నటించిన రెండు హిందీ చిత్రాలు – ‘గుడ్ బై’, ‘మిషన్ మజ్ను’ – ఆమెకి పేరు తీసుకురాలేదు. ఆమె చేతిలో ఇప్పుడు ‘యానిమల్’ అనే భారీ హిందీ మూవీ ఉంది. రన్బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి సందీప్ వంగా దర్శకుడు. ఆశలన్నీ ఆ సినిమాపైనే.

ఇక తమిళంలో కూడా సినిమాలు లేవు. దాంతో, మళ్ళీ తెలుగు సినిమాలపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ‘పుష్ప 2’ కాకుండా ఆమె ఇప్పటివరకు ఇంకో సినిమా మొదలుపెట్టలేదు. తాజాగా ఒక కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

నితిన్, రష్మిక కాంబినేషన్ లో ఇంతకుముందు ‘భీష్మ’ అనే హిట్ సినిమా వచ్చింది. వెంకీ కుడుముల దానికి దర్శకుడు. ఇప్పుడు వీరి ముగ్గురి కాంబినేషన్ లో ఇంకో సినిమా రానుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే ఈ సినిమాని రష్మిక సైన్ చేసింది.

వెంకీ కుడుముల తీసిన రెండు చిత్రాల్లోనూ – చలో, భీష్మ – రష్మిక హీరోయిన్. ఇప్పుడు ముచ్చటగా మూడో చిత్రం చేస్తోంది ఆయన డైరెక్షన్ లో.

 

More

Related Stories