పంజాబీ చిత్రంలో పాయల్

Payal Rajput

పాయల్ రాజపుత్ కి తెలుగులో అవకాశాలు కరువయ్యాయి. సోషల్ మీడియా వేదికపై ఎన్ని హాట్ హాట్ ఫోటోషూట్లు చేసి షేర్ చేసినా… తెలుగులో పెద్దగా ఛాన్సులు రావడం లేదు. ‘ఆర్ ఎక్స్ 100’, ‘వెంకీ మామ’ వంటి హిట్ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. అయినా కూడా ఈ భామకి ఆఫర్లు బాగా తగ్గాయి.

దాంతో, ఇప్పుడు ఇతర భాషల వైపు చూపు వేసింది. పంజాబీలో ఒక కొత్త సినిమా స్టార్ట్ చేసింది. ఈ రోజు ఈ సినిమా లాంచ్ అయింది.

పంజాబీ హీరో గిప్పి గ్రేవాల్ సరసన ఆమె నటిస్తోంది. ‘నా ఆల్ టైం ఫేవరైట్ హీరోతో మొదటిసారి కలిసి నటిస్తున్నా,” అంటూ సోషల్ మీడియాలో ప్రకటించింది.

బాయ్ ఫ్రెండ్ తోనే సెట్ కి రావడం, అన్ని విషయాల్లో ఆమె బాయ్ ఫ్రెండ్ తలదూర్చడం వంటి అంశాలు ఆమెకి నెగెటివ్ చేశాయి.

More

Related Stories