
పవర్ స్టార్ పపవన్ కల్యాణ్ కూడా చిత్ర నిర్మాణంలోకి దిగారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎల్.ఎల్.పి’ తో చేతులు కలిపారు పవర్ స్టార్. పవన్ కల్యాణ్ కి చెందిన పవన్ కల్యాణ్ క్రేయేటివ్ వర్క్స్ బ్యానర్, పీపుల్ మీడియా కలిసి చిత్రాలు నిర్మిస్తాయి. కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తుందట.
“ఇందులో 6 చిన్న తరహా చిత్రాలు… 6 మధ్యతరహా చిత్రాలు… 3 భారీ చిత్రాలు ఉండనున్నాయి.
“పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ – పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చేతులు కలపడం వల్ల యువ ప్రతిభావంతుల స్వచ్ఛమైన ఆలోచనలు… కలలు కార్యరూపం దాల్చే వేదిక రూపుదిద్దుకుంటుంది. కథా రచయితలు, దర్శకుల ప్రతిభకు అనువైన వాతావరణాన్ని కల్పించేలా ఈ భాగస్వామ్యం ఉంటుంది. హరీష్ పాయ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా కీలక బాధ్యతల్లో ఉంటారు. సంస్థ ప్రతినిధులు నిర్దేశిత సమయంలో మరింత సమాచారాన్ని తెలియచేస్తారు,” అని ఈ రెండు సంస్థలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.