వకీల్ సాబ్ కి పర్మిషన్ ఇవ్వని ప్రభుత్వం

Vakeel Saab

దేశమంతా కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. తెలంగాణలో కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. దాంతో పబ్లిక్ ఫంక్షన్లు, సభలు, సమావేశాలపై ఆంక్షలు విధించింది తెలంగాణ ప్రభుత్వం. ‘వకీల్ సాబ్’ ఈవెంట్ ని భారీగా నిర్వహిద్దామనుకున్న దిల్ రాజ్ కి కూడా షాక్ ఇచ్చింది ప్రభుత్వం.

ఏప్రిల్ 3న యూసఫ్ గూడలోని స్టేడియంలో భారీ ఈవెంట్ ని ప్లాన్ చేశారు. కానీ ఆ ఈవెంట్ కి పర్మిషన్ ఇచ్చేందుకు హైదరాబాద్ పోలీస్ లు ఒప్పుకోలేదు. వేరే వెన్యూ కోసం ప్రయత్నిస్తోంది టీం. లేదా ఇంకా ఎక్కడైనా ఏర్పాటు చెయ్యాలనుకుంటున్నారు.

వకీల్ సాబ్’ సినిమా ఏప్రిల్ 9న విడుదల కానుంది. ఇప్పటికే, థియేటర్ల ఆక్యుపెన్సీని కూడా తగ్గించాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. 9వ తేదీలోపు భారీగా కేసులు పెరగకపోతే వకీల్ సాబ్ సేఫ్. లేదంటే… ఆక్యుపెన్సీ తగ్గుతుంది.

More

Related Stories