లండన్లో ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’

నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో ఒక కొత్త సినిమా మొదలైంది. ఈ చిత్రం పేరు ‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’.

నాగశౌర్య, మాళవిక నాయర్ ఇంతకుముందు ‘కళ్యాణ వైభోగమే’ అనే చిత్రంలో నటించారు. చాలా గ్యాప్ తర్వాత వీరిద్దరూ జంటగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’షూటింగ్ ప్రస్తుతం లండన్ లో సాగుతోంది.

‘ఊహలు గుసగుసలాడే’, ‘జో అచ్యుతానంద’ చిత్రాల తర్వాత నాగశౌర్య, అవసరాల కాంబినేషన్ లో వస్తున్న మూవీ ఇది. ఇద్దరికీ హిట్ తప్పనిసరి ఇప్పుడు. అందుకే, చాలా జాగ్రత్తగా చేస్తున్నట్లు కనిపిస్తోంది.

మాళవిక నాయర్ ఇప్పుడు హీరోయిన్ గా మళ్ళీ బిజీ అవుతోంది. నాగ చైతన్య సరసన ‘థాంక్యూ’ చిత్రంలో కూడా నటించింది ఈ భామ.

 

More

Related Stories