నా లవ్ మేటర్ వదిలేయండి ప్లీజ్

నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్న విషయాన్ని స్వయంగా రకుల్ ప్రీత్ సింగ్ గతేడాది ప్రకటించింది. అంతటితో ఆమె ఆ టాపిక్ ను వదిలేసింది. తన పనిపై దృష్టి పెట్టింది. కానీ మీడియా మాత్రం వదల్లేదు. రకుల్ కనిపించిన ప్రతిసారి అదే టాపిక్ ఎత్తడం మొదలుపెట్టింది. దీంతో రకుల్ విసుగెత్తిపోయింది. దయచేసి తన లవ్ మేటర్ వదిలేయండని రిక్వెస్ట్ చేస్తోంది.

“రిలేషన్ షిప్ లో ఉండడం చాలా కామన్. మేం యాక్టర్లం అయినంత మాత్రాన ప్రత్యేకంగా ఏం ఉండదు. సాధారణ ప్రేమికుల్లానే ఉంటాం. మేం ప్రేమలో ఉన్నామనే విషయం చెప్పేశాం. అక్కడితో అయిపోయింది. కానీ ప్రతిసారి మా ప్రేమ విషయమే టాపిక్ అయిపోతంది. అది నాకు ఇష్టం లేదు. మా ఎఫైర్ కంటే నా వర్క్ ఎక్కువగా మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను.”

ఇలా ఓ మోస్తరుగా అసహనాన్ని వ్యక్తం చేసింది రకుల్. రిలేషన్ షిప్ ను కొనసాగిస్తూనే, తామిద్దరం ప్రొఫెషనల్ గా బిజీ అయ్యామని అంటోంది. తమ సినిమాల గురించి కాకుండా, ఎఫైర్ గురించి మాట్లాడతారనే ఉద్దేశంతో తామిద్దరం కలిసికట్టుగా లవ్ లో ఉన్నట్టు ప్రకటించామని, ఇక ఆ మేటర్ ను వదిలేసి సినిమాల గురించి మాట్లాడుకుంటే మంచిదని సూచించింది. 

 

More

Related Stories