
వికాస్ ముప్పాల, గాయత్రి గుప్తా, సాజ్వి పసల, సంతోష్ నందివాడ, కిషోర్ ప్రధాన పాత్రల్లో ‘ప్లాట్’ అనే సినిమా రూపొందుతోంది. గురువారం ఈ సినిమా ట్రైలర్ ని దర్శకుడు వేణు ఊడుగుల విడుదల చేశారు.
“ప్లాట్ టీం ఏడాది క్రితం నా వద్దకు వచ్చింది. పోస్టర్‌ను రిలీజ్ చేశాను. ఆ పోస్టర్ నాకు చాలా నచ్చింది. ఎంతో కొత్తగా, వైవిధ్యంగా ప్రయత్నించారు. ఇదొక ప్రయోగాత్మక చిత్రం. ట్రైలర్ చూస్తే కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లినట్టుగా అనిపిస్తోంది. భాను గురించి భవిష్యత్తులో అందరూ మాట్లాడతారు,” అని అన్నారు వేణు ఊడుగుల.
“వేణు గారు తీసిన నీదీ నాదీ ఒకే కథ నాలో ధైర్యాన్ని నింపింది. కరోనా టైంలో ఓ కథను రాసుకున్నాను. నా ఫ్రెండ్స్ నన్ను నమ్మడంతో ఈ సినిమా ముందుకు వచ్చింది. నా స్నేహితులతో కలిసి సినిమాను నిర్మించాను. ఇటు ఇటుక పేర్చినట్టుగా మా టీంను బిల్డ్ చేసుకుంటూ వచ్చాం. మా దగ్గర ఉన్న వనరులతో ఈ సినిమాను తీశాం,” అన్నారు దర్శక నిర్మాత భాను భవతారక.
“మా ప్లాట్ సినిమా నవంబర్ 3న రిలీజ్ అవుతోంది. చిత్రాన్ని థియేటర్లో చూడండి. కొత్త అనుభూతికి లోనవుతారు,” అని అన్నారు నిర్మాత తరుణ్ విఘ్నేశ్వర్.