
జూనియర్ ఎన్టీఆర్ కారుకున్న ఉన్న బ్లాక్ ఫిలింను హైదరాబాద్ పోలీసులు తొలగించారు. తాజాగా పోలీసులు ప్రత్యేక డ్రైవ్ కొనసాగిస్తున్నారు. వై కేటగిరి భద్రత ఉన్నవాళ్లు తప్ప మిగతా ఎవరూ బ్లాక్ ఫిలింని ఉపయోగించకూడదు. కానీ, సెలెబ్రిటీలు అందరూ వాడుతున్నారు. లేటెస్ట్ గా జూబ్లీహిల్స్ పోలీసులు నిర్వహించిన తనిఖీ సమయంలో ఎన్టీఆర్ కారుని నడుపుతూ అయన డ్రైవర్ వచ్చారు. ఆ సమయంలో కారులో ఎన్టీఆర్ లేరు.
ఎన్టీఆర్ కారుకున్నా ఫిలింని తీసెయ్యడంతో పాటు రూ. 700 జరిమాన కూడా విధించారు పోలీసులు. ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా ప్రమోషన్ కోసం అన్ని నగరాలు తిరుగుతున్నారు.
ఎన్టీఆర్ కి చాలా ఖరీదైన కార్లు అనేకం ఉన్నాయి. కొత్త కొత్త కార్లు కొనడం ఆయన హాబీ.
ఐతే ప్రత్యేకంగా ఎన్టీఆర్ కారుకున్న ఫిలింని మాత్రమే తొలగించలేదు. అన్ని కార్లని తనిఖీ చేస్తున్నారు. ఇటీవల జూబ్లీహిల్స్ లో జరిగిన కారు ప్రమాదం ఘటన నేపథ్యంలో ఈ డ్రైవ్ చేపట్టారు.