త్రిషని టార్గెట్ చేశారా?

Trisha

గతేడాది మన్సూర్ ఖాన్ త్రిష గురించి చిల్లరగా మాట్లాడారు. ఇప్పుడు ఒక రాజకీయనాయకుడు త్రిషపై అసభ్యకరమైన కామెంట్లు చేశారు. మరోసారి త్రిష మండిపడింది. సోషల్ మీడియాలో గొడవ రేగింది. ఆ నేత త్రిషకు క్షమాపణలు చెప్పారు.

ఐతే, ఇలా వరుసగా త్రిష గురించే అందరూ ఎందుకు చీప్ గా మాట్లాడుతున్నారు. తమిళనాడులో త్రిష తరుచుగా ఎందుకు చర్చలోకి వస్తోంది? ఆమెని ఎవరైనా టార్గెట్ చేశారా? ఆమెని కావాలని బద్నామ్ చేస్తున్నారా?

“లియో” సినిమాలో త్రిషని బెడ్ రూమ్ కి తీసుకెళ్లే ఛాన్స్ దక్కలేదని మన్సూర్ ఖాన్ చేసిన వ్యాఖ్యల దూమారం గురించి ఇప్పుడిప్పుడే జనం మర్చిపోతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో తమిళనాడుకి చెందిన ఒక రాజకీయ నాయకుడు త్రిషకి 25 లక్షలు ఇస్తే వచ్చేసింది అంటూ కామెంట్ చెయ్యడం పెద్ద వివాదంగా మారింది.

ఆ మధ్య ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు రీస్టార్ట్ లో వారిని పెట్టమని ఏఐడీఎంకే పార్టీ మాజీ నాయకుడు ఏవీ రాజా వెల్లడించారు. ఆ రిసార్డుకు తరలించిన ఎమ్మెల్యేలకు డబ్బు సహా అన్ని మర్యాదలు చేశారని చెప్పారు. అలాగే ఒక ఎమ్మెల్యే తనకు త్రిష కావాలని అడిగితే ఆమెని రిసార్ట్ కి రప్పించి ఆమెకి 25 లక్షలు ఇచ్చారని ఆయన అనడం దుమారం రేగింది.

ALSO READ: Vishal slams a politician for ‘filthy’ remarks against Trisha

త్రిష ఇప్పటికే తాను ఆ ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అని చెప్పింది. వెంటనే అతను క్షమాపణలు చెప్పారు.

రాజకీయ శక్తుల ప్రమేయం?

Trisha

ఐతే, తమిళనాడులో త్రిష తరుచు వార్తల్లోకి వచ్చేలా చూస్తున్నాయి కొన్ని శక్తులు. ఆమెని అప్రతిష్ట చేసే పనిలో కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి అని వాదన వినిపిస్తోంది. ఆమెని మెల్లగా బద్నామ్ చేసి ఆ తర్వాత ఆమె పేరుతో మరో ప్రముఖుడిపై బురద చల్లేందుకు వేస్తున్నస్కెచ్ ఇది అని మరికొందరు అంటున్నారు.

ఏది ఏమైనా త్రిష ఇప్పుడు ఇలాంటి దిగజారుడు కామెంట్స్ వల్ల ఇబ్బందిపడుతోంది.

ఐతే, ఆమె కెరీర్ మాత్రం సూపర్ గా దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఆమె మణిరత్నం తీస్తున్న “థగ్ లైఫ్” అనే చిత్రంలో కమల్ హాసన్ సరసన నటిస్తోంది. ఇక మెగాస్టార్ చిరంజీవితో “విశ్వంభర” చిత్రం చేస్తోంది.

 

More

Related Stories