5 లక్షల దగ్గర ఆగిన పూజ

Pooja Hegde

టాలీవుడ్ లో పూజా హెగ్డేకు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆమె కాల్షీట్లను అటు బాలీవుడ్ నిర్మాతలు ఎగరేసుకుపోవడానికి రెడీగా ఉన్నారు. అందుకే ఓ బడా తెలుగు నిర్మాత ఇబ్బందుల్లో పడ్డాడు. కేవలం 5 లక్షల దగ్గర బేరం తెగకపోవడంతో.. పూజా హెగ్డే పేరును ప్రకటించలేకపోతున్నారు.

ఇంతకీ మేటర్ ఏంటంటే.. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేశారు సదరు తెలుగు నిర్మాత. ఆ సినిమా కోసం పూజా హెగ్డేను సంప్రదించారు. పూజా కూడా ఒప్పుకుంది. కాకపోతే రెండున్నర కోట్లు అడిగింది. ఎందుకంటే, అంతే మొత్తం ఇవ్వడానికి బాలీవుడ్ నిర్మాతలు రెడీగా ఉన్నారు మరి.

కానీ సదరు ప్రొడ్యూసర్ మాత్రం రెండున్నర ఇవ్వనన్నారట. కాస్త తగ్గించుకోమని అడిగితే…. పూజా హెగ్డే ఓ 20 లక్షలు తగ్గించుకుంది. రెమ్యూనరేషన్ దగ్గర గీచిగీచి బేరాలాడే ఆ నిర్మాత మాత్రం మరో 5 లక్షలు తగ్గించుకోమన్నారు. అంటే.. మొత్తంగా పాతిక లక్షలు తగ్గించుకోవాలన్నమాట.

2 కోట్ల 25 లక్షలకే పూజా హెగ్డే సినిమా చేయాలి. ఓ వైపు ఫుల్ డిమాండ్ తో ఉన్న పూజా హెగ్డే ఈ రేటు కటింగ్ కు ఒప్పుకుంటుందా అనేది డౌట్. అందుకే ఆ నిర్మాత ఇంకా పూజా పేరును ప్రకటించలేకపోతున్నారు. 5 లక్షల దగ్గర అడకత్తెరలో ఆగింది ఆ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా.

Related Stories