- Advertisement -

పూజ హెగ్డే తన మంచి మనసుని బయట పెట్టింది. సోషల్ మీడియాలో మెసేజ్ లు పెట్టడమే కాదు చేతల్లో కూడా చూపించింది. ముంబై నగరంలోని వంద పేద కుటుంబాలకు సరుకులు అందచేసింది పూజ.
నెలకు సరిపడే రేషన్ కిట్స్ ని ప్యాక్ చేసి పంపించింది. కుటుంబ సభ్యులతో కలిసి స్వయంగా తనే ప్యాక్ చేసింది. ఈ కరోనా సంక్షోభ సమయంలో పూజ హెగ్డే తన సేవాభావాన్ని చూపింది. ఆమె కూడా ఇటీవలే కోవిడ్ బారిన పడి కోలుకొంది.
పూజ హెగ్డే చేతిలో ప్రస్తుతం చాలా సినిమాలున్నాయి. ‘రాధేశ్యామ్’, ‘ఆచార్య’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.