అతని వల్ల ఇబ్బందిపడిందిగా!

Pooja Hegde

పూజ హెగ్డే చాలా కాలం పాటు తన బాయ్ ఫ్రెండ్ ఎవరు అనే విషయాన్ని దాచి పెట్టింది. ఆమె ఇంతకుముందు హీరోయిన్ గా ఎప్పుడూ బిజీగా ఉండేది. దాంతో, ఆమె బయట తన బాయ్ ఫ్రెండ్ రోహన్ మెహ్రాతో పెద్దగా కనిపించలేదు. కానీ ఆమెకి ఇప్పుడు ఆఫర్లు తగ్గిపోయాయి. ఏడాదిన్నరగా ఆమె తెలుగులో ఒక్క సినిమాలో నటించలేదు. దాంతో ఆమె ఇప్పుడు పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది.

మొన్న శనివారం రాత్రి ఆమె ముంబైలోని ఒక ఇటాలియన్ రెస్టారెంట్ కి వెళ్ళింది. బయటికి వస్తున్నప్పుడు అక్కడ ఉన్న పాపరాజిని చూసి స్టన్ అయిపొయింది. ఆమె బాయ్ ఫ్రెండ్ మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు.

ఆమె కెమెరాలకు ఫోజులు ఇచ్చి కార్లో కూర్చొంది. కాసేపటికి ఆమె బాయ్ ఫ్రెండ్ రోహన్ మెల్లగా వచ్చి అదే కారులో కూర్చున్నాడు. అతనితో కలిసి కెమెరాలా ముందుకు వచ్చేందుకు పూజ ఇష్టపడలేదు. ఆమె చాలా ఇబ్బంది పడింది అని అర్థమైంది.

మరోవైపు, ఈ భామ తాజాగా నాగ చైతన్య సరసన ఒక సినిమా చేసే అవకాశం ఉందని టాక్.

More

Related Stories