ఆ సినిమా కోసం పూజ రిహార్సల్స్!


పూజ హెగ్డే తెలుగులో సైన్ చేసిన కొత్త చిత్రాలు మొదలు కావడానికి ఇంకా టైముంది. ఈ గ్యాప్ లో ఆమె బాలీవుడ్ లో ఒప్పుకున్న ఒక పెద్ద చిత్రం పూర్తి చేసే పనిలో ఉంది. తాజాగా ఆమె సల్మాన్ ఖాన్ కొత్త సినిమా కోసం రిహార్సల్స్ చేస్తూ మీడియా కంట చిక్కింది.

సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందే ‘కభీ ఈద్ కభీ దివాళి’ చిత్రంలో ఆమె హీరోయిన్. ఈ సినిమా షూటింగ్ వచ్చే వారమే ప్రారభం. సల్మాన్ ఖాన్ వంటి పెద్ద హీరో సరసన అవకాశం కావడంతో ఆమె చాలా శ్రద్ధగా పని చేస్తోంది.

పూజ హెగ్డే ఒప్పుకున్న తెలుగు చిత్రాలు: త్రివిక్రమ్ – మహేష్ బాబు మూవీ, ‘భవదీయుడు భగత్ సింగ్’. మహేష్ బాబు చిత్రం జూన్ లోనో, జూలైలోనో మొదలవుతుంది. ‘భవదీయుడు భగత్ సింగ్’ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎవరికీ తెలియదు. సో, పూజ మరో రెండు చిత్రాలు ఒప్పుకునే ఆలోచనలో ఉంది.

ఐతే, విజయ్ దేవరకొండ సరసన ఆమె నటిస్తోంది అన్న వార్త ప్రచారం జరుగుతోంది. కానీ, అది ఇంకా కంఫర్మ్ కాలేదు.

 

More

Related Stories