కారు ఇవ్వండి: పూజ హెగ్డే


పూజ హెగ్డేకి బాలీవుడ్ లో సక్సెస్ రేట్ తక్కువ. కానీ ఆమె చుట్టూ అల్లుకున్న రూమర్లు ఎక్కువ. సల్మాన్ ఖాన్ తో డేటింగ్ అని ఒకసారి, నిర్మాత సాజిద్ నడియాడవాలా తో క్లోజ్ గా ఉంటోంది అని మరోసారి పుకార్లు షికారు చేశాయి.

బాలీవుడ్ లో ఉన్న రూమర్లకు తోడు ఇటీవల టాలీవుడ్ లో కూడా ఇలాంటివి జత అయ్యాయి. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ తీస్తున్న కొత్త సినిమాలో ఆమెకి కంఫర్ట్ గా ఉండాలని ప్రత్యేకంగా కారుని కొని ఆమెకి ఇచ్చారు అనే ప్రచారం ఊపందుకొంది.

“ప్రతి రూమర్ కి స్పందించాలంటే చికాకు. కారు కొనిచ్చారు అని రాసేవాళ్ళు అయినా ఆ కారు ఎదో నాకిస్తే బాగుంటుంది,” అని స్పందించి మీడియాకి చురకలు వేసింది పూజ హెగ్డే.

ప్రస్తుతం ఈ భామ ‘కిసి కా భాయ్ కిసి కి జాన్’ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న ఈ భామ మీడియాకిస్తున్న ఇంటర్వ్యూలలో ఇలా క్లారిటీ ఇచ్చింది.

Pooja Hegde

ALSO CHECK: Pooja Hegde at KK Bhai KK Jaan promotions

ఇక తెలుగులో మహేష్ బాబు సినిమా సెట్స్ పై ఉంది. పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా చర్చల దశలో ఉంది కానీ అది సెట్ అవుతుందో లేదో చూడాలి.

 

More

Related Stories