హీరోలతో పూజ డబుల్ గేమ్!

Pooja Hegde


అల్లు అర్జున్ తో రెండు చిత్రాలు (దువ్వాడ జగన్నాధం, అల వైకుంఠపురంలో) చేసింది పూజ హెగ్డే. మహేష్ బాబుతో రెండో మూవీ ఒప్పుకొంది. వరుణ్ తేజ్ తో కూడా (ముకుంద, గడ్డలకొండ గణేష్) రెండు చిత్రాల్లో నటించింది. రామ్ చరణ్ తో కూడా రెండు సార్లు డ్యాన్స్ చేసింది (‘రంగస్థలం’లో ఐటెం సాంగ్, ‘ఆచార్య’లో జోడిగా).

ఇలా తెలుగులో నటించిన హీరోలతోనే మళ్ళీ జత కడుతోంది.

ఎన్టీఆర్ సరసన ‘అరవింద సమేత’ చిత్రంలో నటించింది. మరి నెక్స్ట్ ఏదైనా సినిమాలో యాక్ట్ చేస్తుందా అన్నది చూడాలి. కొరటాల శివ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ని తీసుకోవాలనుకుంటున్నారు. ఒకవేళ వేరే ఎవరి డేట్స్ దొరక్కపోతే పూజ హెగ్డేనే అప్రోచ్ అవుతారా అన్నది చూడాలి.

ప్రభాస్ తో ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ సినిమాలో పూజ హెగ్డే నటించింది. కానీ ప్రభాస్ తో ఆమె రెండోసారి నటించే అవకాశం లేదు. హీరోలతో పాటు కొందరి దర్శకుల కాంబినేషన్ లో ఆమె మళ్ళీ నటిస్తోంది.

Advertisement
 

More

Related Stories