15 మిలియన్ల ‘బుట్టబొమ్మ’!

- Advertisement -
Pooja Hegde

పూజా హెగ్డేకి సినిమా ఇండస్ట్రీలో యమా క్రేజ్ ఉంది. సోషల్ మీడియాలో కూడా ఆమె పాపులారిటీ పెరుగుతోంది. ఈ అందాల భామ… రెండు లాక్డౌన్ ల మధ్య 2 మిలియన్ల ఫాలోవర్స్ ని కొత్తగా యాడ్ చేసుకొంది. మొదటి లాక్డౌన్ కి ముందు ఆమెకి ఇన్ స్టాగ్రామ్ లో 13 మిలియన్ల ఫాలోవర్స్ ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 15కి చేరింది.

నిత్యం అభిమానుల కోసం ఫోటోలను షేర్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా వ్యవహరిస్తుంది ఈ బ్యూటీ. అందుకే, ఇన్‌స్టాగ్రామ్‌లో 15 మిలియన్ల ఫాలోవర్స్‌ మైల్ స్టోన్ కి చేరుకొంది. ఈ సందర్భంగా “దువ్వాడ జగన్నాధం” సినిమా నుంచి ఇప్పటి వరకు తన వెంట ఉంటున్న టీంని కూడా తన అభిమానులకి పరిచయం చేసింది.

పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో అత్యధిక పారితోషికం తీసుకొనే దక్షిణాది హీరోయిన్. బాలీవుడ్ భామలు తెలుగులో నటిస్తే నాలుగు, ఐదు కోట్లు డిమాండ్ చేస్తున్నారు. నయనతార, సమంత, అనుష్క వంటి హీరోయిన్లు ఇప్పటి వరకు రెండున్నర కోట్లకు మించి తీసుకోలేదు. పూజ ప్రస్తుతం సినిమాకి 3 కోట్లు అందుకుంటోంది.

ఆమె నటించిన ‘ఆచార్య’, ‘మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచిలర్’, ‘రాధే శ్యామ్’ చిత్రాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. అలాగే, విజయ్ సరసన ‘బీస్ట్’ మూవీలో నటిస్తోంది. కొత్తగా మహేష్ బాబు సరసన త్రివిక్రమ్ చిత్రం సైన్ చేసింది.

 

More

Related Stories