కన్నడంలో పూజకి బిగ్ ఆఫర్?

- Advertisement -
Pooja Hegde

పూజ హెగ్డే తల్లితండ్రులు కన్నడిగులు. ఆమె మూలాలు మంగళూరులో ఉన్నాయి. ఇటీవలే మంగళూరుకి వెళ్ళినప్పుడు సొంత ప్రదేశానికి వచ్చాను అంటూ సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలతో అదరగొట్టింది. ఐతే, ఈ భామ కన్నడంలో మాత్రం ఇప్పటివరకు నటించలేదు.

ఆ లోటు ఇప్పుడు తీరే అవకాశం వచ్చింది. పూజ హెగ్డే తాజాగా ఒక బడా కన్నడ సినిమాలో ఆఫర్ కొట్టేసింది అని టాక్. ఆ వివరాలు త్వరలోనే బయటికి రానున్నాయి.

ఐతే ఆమె ఈ సినిమా గురించి పెదవి విప్పడం లేదు. “గుంటూరు కారం”, “ఉస్తాద్ భగత్ సింగ్” వంటి సినిమాల నుంచి ఆమెని తొలగించారు. 10 రోజుల పాటు షూటింగ్ చేశాకే ఆమె “గుంటూరు కారం” నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అలాగే విజయ్ దేవరకొండతో నటించిన “జన గణ మన” చిత్రం ఆగిపోయింది. ఈ చేదు అనుభవాలతో ఆమె తన కొత్త సినిమాల గురించి చెప్పడం లేదు.

రెండేళ్ల క్రితం వరకు తెలుగులో అగ్ర హీరోయిన్ గా కొనసాగిన పూజ హెగ్డే ఇప్పుడు అవకాశాల కోసం చూస్తోంది. మరి ఈ కన్నడ బిగ్ మూవీ అయినా సెట్ పైకి వెళ్తుందా? ఆమె కెరీర్ ని మళ్ళీ ట్రాక్ లోకి తెస్తుందా?

 

More

Related Stories