పూజ హెగ్డేకి మరింత విశ్రాంతి

- Advertisement -

ఇటీవల షూటింగ్ లో కాలు బెణకడంతో పూజ హెగ్డే ఇంట్లో విశ్రాంతి తీసుకుంటోంది. రెండు వారాల పాటు ఇంట్లోనే ఉండాలని డాక్టర్లు సూచించారు. ఐతే, ఆమెకి అనుకోకుండా ఇంకా ఎక్కువ రోజుల విశ్రాంతి దొరకనుంది.

సల్మాన్ ఖాన్ కి తాజాగా డెంగ్యూ వచ్చింది. డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న సల్మాన్ మూడు వారాల పాటు షూటింగ్ ని రద్దు చేశారు. పూజ హెగ్డే, సల్మాన్ ఖాన్ జంటగా నటిస్తున్నారు ‘కిసి కా భాయ్, కిసి కి జాన్’ అనే చిత్రంలో. ఈ సినిమా షూటింగ్ లోనే పూజ హెగ్డే కాలుకి గాయమైంది. ఇదే షూటింగ్ లో పాల్గొంటుండగా సల్మాన్ కి డెంగ్యూ వచ్చింది.

దాంతో, ఆమెకి అనుకోకుండా ఇంకా ఎక్కువ రోజుల విశ్రాంతి దొరికింది.

ప్రస్తుతం పూజ హెగ్డే చేతిలో పెద్దగా చిత్రాలు లేవు. సల్మాన్ ఖాన్ సినిమా కాకుండా ఆమె ఒప్పుకున్న చిత్రం …. మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీనే. ఇది నవంబర్ లో మొదలవుతుంది. అప్పటి వరకు పూజ ఖాళీనే.

ALSO CHECK: Pooja Hegde goes for all things gold

 

More

Related Stories