‘నా కాళ్ళు చూడండి, నాభి కాదు’

Pooja Hegde

గతంలో తాను చేసిన ఒక కామెంట్ ని సరిగా అర్థం చేసుకోలేక పెద్ద రచ్చ చేసారని, లేటెస్ట్ గా వివరణ ఇచ్చినట్లుంది పూజ హెగ్డే. ఈ కొత్త ఎక్స్ ప్లేనేషన్ తో ఆమె మరింతగా ట్రోలింగ్ కి గురి అవుతోంది. “దక్షిణాది ప్రేక్షకులకు, ఫిలిం మేకర్స్ కి నడుము పిచ్చి. హీరోయిన్ల నాభి, నడుము మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అదే గ్లామర్ షో అనుకుంటారు,” అని ఇంతకుముందు ఒక విమర్శ చేసింది.

లేటెస్టుగా బాలీవుడ్ క్రిటిక్ అనుపమ చోప్రాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ ప్రస్తావన వచ్చింది. “అల వైకుంఠపురంలో” సినిమాలో ఆమె కాళ్ళ మీదే డైరెక్టర్ త్రివిక్రమ్ ఫోకస్ పెట్టాడు. ఒక బాస్ పాత్రలో నటించిన పూజ అలంటి సీన్ ఎందుకు ఒప్పుకుంది అన్న అనుపమ ప్రశ్నకు పూజ సమాధానం ఇచ్చింది.

“నేను ఏమంటాను అంటే.. ఒక మగాడు నా బొడ్డు చూసే బదులు నా కాళ్ళ వైపు లుక్కేస్తే హ్యాపీగా ఫీల్ అవుతా అని ఇంతకుముందు మీడియాతో చెప్పా… అది నా అభిప్రాయం ,” అని నవ్వుతూ సమాధానం ఇచ్చింది.

ఐతే, తెలుగుసినిమా.కామ్ సహా కొన్ని పలువురు క్రిటిక్స్ “అల వైకుంఠపురంలో” సినిమా విడుదల అయినప్పుడే ఈ సీన్ ఎంత “బాడో” ప్రస్తావించారు. దానికి పూజ ఇప్పుడు ఇచ్చిన వివరణ మరీ అసంబద్ధంగా ఉంది.

అందుకే పూజ చేసిన కామెంట్స్ కూడా బాగా ట్రోలింగ్ కి గురి అవుతున్నాయి. సోషల్ మీడియాలో కొందరు అభిమానులు ప్రతి స్టేట్ మెంట్ కి వారి “మనోభావాలు” దెబ్బతీసుకుంటున్నారు. ఎవరి అభిప్రాయం వాళ్ళది అని లైట్ తీసుకోండి బాస్. చిల్!

పూజ హెగ్డే ప్రస్తుతం ప్రభాస్ సరసన “రాధేశ్యామ్”లో నటిస్తోంది. అలాగే, అఖిల్ తో “మోస్ట్ ఎలిజిబిల్ బాచిలర్” చేస్తోంది.

Related Stories