పెద్ద టూరేసిన పూజ

- Advertisement -
Pooja Stills 020622 003


హీరోయిన్ పూజ హెగ్డే పెద్ద టూర్ పెట్టుకొంది. నెల రోజుల పాటు ఆమె వెకేషన్లో ఉంటుంది. మరో నెల పాటు ఏ షూటింగ్ లు లేకపోవడంతో హాయిగా ఎంజాయ్ చేద్దామని టూర్ కి వెళ్ళింది.

టూర్ కి వెళ్తున్న ఫోటోని షేర్ చేస్తూ, ఇలా రాసుకొంది: “నెల రోజులు. మూడు ఖండాలు. నాలుగు నగరాలు. ఛలో. #gypsiegirl”. అంటే తన ఐటినరి (టూర్ ప్రణాళిక) బయటపెట్టింది. ఆమె ముందుగా బ్యాంకాక్ వెళ్ళింది. అక్కడ కొన్నాళ్ళూ ఉండి, ఆ తర్వాత మరో మూడు నగరాలు చుట్టేస్తుందన్నమాట. ఆమె టూర్ అంతా ఏషియాలోనే.

సల్మాన్ ఖాన్ సరసన ఆమె నటిస్తున్న ‘కభీ ఈద్ కభీ దివాళి’ షూటింగ్ షెడ్యూలు పూర్తి అయింది. వచ్చే నెలలో ఆమె మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందే సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. ఈ సినిమా ఆగస్టు రెండో వారంలో మొదలు కానుంది. సో.. ఈ గ్యాప్ లో నెల రోజుల పాటు వెకేషన్ పెట్టుకొంది.

సినిమాకి మూడు కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే పూజ హెగ్డేకి ట్రావెలింగ్ అంటే ఇష్టం.

ALSO READ: Pooja Hegde is happy with the SSMB28 announcement

More

Related Stories