భారీగా పెంచేసిన పూజా హెగ్డే?

తెలుగు చిత్ర పరిశ్రమలో పూజా హెగ్డే టాప్ పొజిషన్‌లో దూసుకుపోతోంది. ఈ స్లాట్‌లో ఆమెకు ఆల్టర్నేట్ లేదు. కాబట్టి తన ప్రతి సినిమాకు పారితోషికం పెంచుకుంటూ పోతోంది ఈ భామ. ఈ ప్రక్రియలో భాగంగా తాజాగా మరోసారి పారితోషికాన్ని సవరించింది. ఇప్పుడు 5 కోట్ల రూపాయలకు చేరుకుందని టాక్.

తాజా సమాచారం ప్రకారం.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న జనగణమన సినిమా కోసం ఆమె అందుకున్న మొత్తం అక్షరాలా 5 కోట్లు. ఇందులో ఆమె పారితోషికం రూ. 4 కోట్లు కాగా ఆమె సిబ్బంది జీతాలు మరియు ఇతర ఖర్చుల కోసం కోటి రూపాయలు అన్నమాట. టాలీవుడ్ లో ఇప్పటివరకు ఓ హీరోయిన్ అందుకున్న అత్యధిక పారితోషికం ఇదే.

ఆమె చేతిలో మహేష్-త్రివిక్రమ్ సినిమా, పవన్-హరీష్ శంకర్ సినిమాలు ఉన్నాయి. అయితే రెండో సినిమా ఎప్పుడు మొదలవుతుందనే క్లారిటీ లేదు. ఆ తర్వాత ఆమెకు రెండు హిందీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.

దాదాపు టాప్ హీరోలందరూ పూజతో కలిసి నటించారు కాబట్టి రిపీట్ అయ్యే అవకాశాలు అంతంత మాత్రమే. అందుకే పూజ, క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకునే పనిలో ఉంది.

 

More

Related Stories