గుణశేఖర్ శకుంతల ఈమేనా?

గుణశేఖర్ శకుంతల ఈమేనా?

ఉరుములేని వర్షంలా సడెన్ గా పాన్-ఇండియా సినిమా ప్రకటించాడు దర్శకుడు గుణశేఖర్. అదే “శాకుంతలం”. రానాతో చేయాల్సిన “హిరణ్యకశిప” సినిమాపై అతడు వర్క్ చేస్తున్నాడని భావిస్తున్న చాలామందికి అది షాక్. మహాభారతంలోని ఆదిపర్వం నుంచి ఓ ఆహ్లాదకరమైన ప్రేమకథను తీసుకొని సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు. అదే శాకుంతలం. దుశ్యంత్, శకుంతల మధ్య ప్రేమకథ ఇది. మహాకవి కాళిదాసు రాసిన స్టోరీ ఆధారంగా తెరకెక్కుతోంది. గుణశేఖర్ కూతురు నీలిమ గుణ నిర్మాత.

సినిమా డీటెయిల్స్ తో పాటు మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు. అంతా బాగానే ఉంది కానీ ఇందులో లీడ్ రోల్ పోషించేది ఎవరనే విషయాన్ని మాత్రం దర్శకుడు ఇంకా చెప్పలేదు. సరిగ్గా ఇక్కడే పుకార్లకు స్కోప్ పెరిగింది.

Shaakuntalam | Motion Poster | Gunasekhar | Manisharma | Gunaa Teamworks

ఫిమేల్ సెంట్రిక్ కథతో రాబోతున్న “శకుంతలం”లో శకుంతల పాత్ర కోసం పూజా హెగ్డేను గుణశేఖర్ సంప్రదించినట్టు వార్తలొస్తున్నాయి. పాన్-ఇండియా మూవీ అవ్వడం, పూజా హెగ్డేకు బాలీవుడ్ కనెక్ట్ కూడా ఉండడంతో ఈ పుకారు కూసింత నమ్మేలానే ఉంది. కానీ గుణశేఖర్ నుంచి ప్రకటన వచ్చే వరకు ఎవరనేది చెప్పలేం.

More

Related Stories