ఇక లైన్లో పూజ హెగ్డే!

పూజ హెగ్డే సోదరుడు పెళ్లి చేసుకున్నాడు. నిజానికి పూజ హెగ్డే పెళ్లి ముందు కావాలి. ఆ తర్వాతే ఆమె సోదరుడు పెళ్లి చేసుకోవాలి. కానీ, హీరోయిన్ గా కెరీర్ సూపర్ గా వెళుతున్న తరుణంలో పెళ్లి చేసుకుంటే ఇబ్బంది అవుతుందని ఆమె తన ప్లాన్స్ వాయిదా వేసుకొంది. దాంతో, ఆమె సోదరుడు ముందు పెళ్లి చేసుకున్నాడు.

ఐతే, పూజ హెగ్డే కూడా లైన్ లో ఉంది. మరో రెండేళ్ల తర్వాత పెళ్లి ఆలోచన చేస్తుందట.

పూజ హీరోయిన్ గా సక్సెస్ అయిన తర్వాతే వాళ్ళ కుటుంబం ముంబైలో పెద్ద ఇల్లు కొనుక్కొంది. గతేడాది గృహ ప్రవేశం చేశారు. పూజ హెగ్డే తన కుటుంబానికి, తనకి ఫుల్లుగా సంపాదించి పెట్టిన తర్వాత పెళ్లి చేసుకుంటుందట. ప్రస్తుతం సినిమాకి 3, 4 కోట్లు తీసుకుంటోంది పూజ హెగ్డే. ఐతే, ఇటీవల ఆమె నటించిన సినిమాలు అన్నీ ఢమాల్ అన్నాయి. తిరిగి క్రేజ్ తెచ్చుకొని ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలనేది ఆమె ప్రస్తుత టార్గెట్.

అందుకే, పెళ్లి ఆలోచన వాయిదా వేసుకొంది ఈ 33 ఏళ్ల సుందరి.

 

More

Related Stories