పూజకి అన్నీ మిస్సే, మరి ఛాన్స్ ఎలా?

Pooja Hegde

పూజ హెగ్డేకి ఇప్పట్లో మరో ఛాన్స్ వచ్చేనా అన్న డౌట్ వస్తోంది. ఏడాదిన్నర క్రితం వరకు ఆమె తెలుగులో నంబర్ వన్. ఇప్పుడు ఆమెకి ఒక్క ఆఫర్ రావడం లేదు.

రవితేజ – హరీష్ శంకర్ సినిమాలో మొదట వినిపించిన పేరు పూజ హెగ్డే. హరీష్ శంకర్ ఆమెతో ఫోటోషూట్ చేసేందుకు రెడీ అయినట్లు వార్తలు వచ్చాయి. కానీ హరీష్ చివరి నిమిషంలో మనసు మార్చుకొని తాను పరిశీలించిన పలువురు కొత్త హీరోయిన్లలో ఒకరికి అవకాశం ఇచ్చారు.

భాగ్యశ్రీ బోర్స్ అనే కొత్త భామ రవితేజ సరసన ఛాన్స్ కొట్టేసిన విషయం మనకు తెలుసు. కానీ భాగ్యశ్రీ కన్నా ముందు దాదాపుగా ఓకే అయిన పేరు పూజ హెగ్డే. ఈ సినిమా కూడా మిస్ కావడం పూజకి పెద్ద మైనస్.

దీంతో ఆమె తెలుగులో మూడు సినిమాలు మిస్ చేసుకొంది. “గుంటూరు కారం”లో ఆమె హీరోయిన్. కానీ ఒక షెడ్యూల్ పూర్తి అయిన తర్వాత ఆమెని తొలగించారు. “ఉస్తాద్ భగత్ సింగ్”లో కూడా ఆమె పేరునే హీరోయిన్ గా ప్రకటించారు. అదీ పోయింది. ఇప్పుడు పేరు ప్రకటించకపోయినా ఆమెకే దక్కాల్సిన సినిమా కొత్త భామ లాగేసుకొంది.

వరుసగా ఫ్లాపులు రావడంతో పూజ హెగ్డేకి క్రేజ్ తగ్గింది. అందుకే తెలుగులో ఇప్పుడు మొత్తంగా అవకాశాలు సన్నగిల్లాయి.

Advertisement
 

More

Related Stories