పూజ… ఆ విషయంలో తగ్గేదే లే!

- Advertisement -
Pooja Hegde


పూజ హెగ్డే… టాలీవుడ్ లో ఇప్పుడు నంబర్ వన్ హీరోయిన్. అందుకే ఆమె డేట్స్ కోసం నిర్మాతలు ఎగబడుతున్నారు. అయినప్పటికీ, కొందరు నిర్మాతలు మాత్రం ఆమెని డిస్కౌంట్లు అడుగుతున్నారట.

ఆమెకి అంత క్రేజ్ ఉందని తెలిసి కూడా “కొంచెం తగ్గించమ్మా” అంటూ బేరాలు ఆడుతున్నారట కొందరు నిర్మాతలు. ఐతే, హీరోలకి ఎగబడి రేట్లు పెంచే ఈ నిర్మాతలు హీరోయిన్ల దగ్గరికి వచ్చేసరికి బేరాలు ఎందుకు ఆడుతారు అని పూజ అనుకుంటోంది కాబోలు. అందుకే, తగ్గేదే లే అంటూ పట్టుదలగా ఉంది

ఒక యువ హీరో సినిమాని వదులుకునేందుకు సిద్ధంగా ఉంది పూజ హెగ్డే. త్వరలో ప్రారంభం కాబోయే ఈ సినిమాలో ఆమెని తీసుకుంటే క్రేజ్ వస్తుందని నిర్మాత భావించాడు. మేనేజర్ కి డేట్స్ కోసం ఫోన్ చేశాడు సదరు నిర్మాత. ఆ నిర్మాత వ్యవహారం ఆమె అర్థం చేసుకున్నట్లుంది. అందుకే, తాను అడిగిన పారితోషికం ఇస్తాను అని అంటేనే అప్పుడు సైన్ చెయ్యాలా వద్ద అని ఆలోచిస్తాను అని చెప్పిందట.

పూజ హెగ్డే తన పారితోషికం విషయంలో అంత పట్టుదలగా ఉంది.

More

Related Stories