డాన్స్, సాంగ్స్ ను తక్కువ చేయొద్దు

ఇండియన్ సినిమాపై విదేశీయుల్లో ఓ చిన్న చూపు ఉంది. సినిమాల్లో పాటలు పెడతారని, అంతా కలిసి డాన్స్ చేస్తారని.. కథకు సంబంధం లేకుండా అవన్నీ వచ్చి పోతుంటాయనే రిమార్క్ ఉంది. దీనిపై హీరోయిన్ పూజా హెగ్డే స్పందించింది. విదేశీయులు కూడా ఇప్పుడు ఇండియన్ మ్యూజిక్, డాన్స్ ను ఎంజాయ్ చేస్తున్నారని.. వాటిని తక్కువ అంచనా వేయొద్దని చెబుతోంది.

“సాంగ్స్, డాన్స్ మన బలం. ఈ విషయంలో మనం సిగ్గు పడకూడదు. వాటిని మనం మరింత ప్రోత్సహించాలి. ఒకప్పుడు విదేశీయులు సత్యజిత్ రే సినిమాల్ని ఇష్టపడేవారు. కానీ ఇప్పుడు వాళ్లు దేవదాస్ లాంటి సినిమాల్ని కూడా ఇష్టపడుతున్నారు. అందులో మన కల్చర్, డాన్స్, మ్యూజిక్ ను లవ్ చేస్తున్నారు. ఈ అంశాల్ని కూడా విదేశీ మీడియా మెచ్చుకుంటోంది.”

కాన్స్ చిత్రోత్సవంలో తొలిసారి మెరిసిన ఈ బ్యూటీ, ఇండియాకు తిరిగొచ్చింది. కాన్స్ లో పాల్గొనడంతో కెరీర్ పరంగా తను రైట్ ట్రాక్ లోనే ఉన్న ఫీలింగ్ కలిగిందని చెప్పుకొచ్చింది పూజా. తను బ్రాండ్స్ తీసుకొని కాన్స్ కు వెళ్లలేదని, బ్రాండ్ ఇండియాగా దేశం నుంచి కాన్స్ ను రిప్రజెంట్ చేశానని తెలిపింది.

ఒకప్పుడు విదేశాల్లో బాలీవుడ్ సినిమాకే గుర్తింపు ఉండేదని, కానీ ఇప్పుడు ఆ తారతమ్యాలన్నీ పోయి.. అన్ని భాషల సినిమాలు ఇండియన్ సినిమాగా విదేశాల్లో గుర్తింపు పొందుతున్నాయని, ఇది చాలామంది పరిణామం అంటోంది పూజాహెగ్డే. త్వరలోనే ఈ బ్యూటీ, సల్మాన్ ఖాన్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతోంది.

Advertisement
 

More

Related Stories