ప్రభాస్ కే ఫస్ట్ ప్రిఫరెన్స్!

Pooja Hegde

ప్రభాస్ సరసన ‘రాధే శ్యామ్’లో నటిస్తోంది పూజ హెగ్డే. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకొంది. ఈ సినిమా కోసమే తాను నటిస్తోన్న ఓ బాలీవుడ్ మూవీ షూటింగ్ ని కూడా క్యాన్సిల్ చేసుకుందట. నిజానికి, హీరోయిన్లు బాలీవుడ్ సినిమాల పేర్లు చెప్పి తెలుగు సినిమాలకు డేట్స్ ఇచ్చేందుకు నిర్మాతలను ఇబ్బంది పెడుతారు. కానీ పూజ హెగ్డే మాత్రం… ప్రభాస్ సినిమాకే మొదటి ప్రాధ్యాన్యం అని తేల్చడం విశేషం.

“రాధే శ్యామ్” షూటింగ్ కోసం ఇటీవల ఆమె బాలీవుడ్ దర్శక, నిర్మాత రోహిత్ శెట్టి వద్దకు వెళ్లి… తన డేట్స్ ని మార్చాలని అడిగిందట. రణవీర్ సింగ్ హీరోగా రోహిత్ శెట్టి “సర్కస్” అనే సినిమా తీస్తున్నాడు. పూజ హెగ్డే ఇందులో హీరోయిన్.

ఐతే, “రాధే శ్యామ్” షూటింగ్ ఉంది… అది ముందుగా పూర్తి చెయ్యాలని తనకి సంబందించిన పోర్షన్ ని తర్వాత తీయండి అని రోహిత్ ని కోరిందట. అంతగా ప్రభాస్ మూవీకి డేడికేట్ అయింది.

పూజ హెగ్డే ప్రస్తుతం ఇటు తెలుగు, అటు బాలీవుడ్ మూవీస్ రెండింట్లో నటిస్తోంది.

More

Related Stories