
‘రాధేశ్యామ్’ వచ్చింది… పోయింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ కి, పూజకి గొడవైంది. అయినా అవేవి పట్టించుకోకుండా పూజ హెగ్డే ప్రొమోషన్ ఈవెంట్స్ అన్నింట్లో పాల్గొంది. పాన్ ఇండియా సినిమా కాబట్టి ఆడితే తనకి కూడా ఇమేజ్ పెరుగుతుందని ఆశపడింది. కానీ, పూజ హెగ్డే నిరాశచెందాల్సి వచ్చింది. సినిమా తెలుగేతర ప్రాంతాలన్నింట్లో ఢమాల్ అయింది. కనీస ఓపెనింగ్స్ కూడా రాబట్టుకోలేదు.
దాంతో, ఈ సినిమా గురించి పక్కన పెట్టి మరో పెద్ద సినిమాపై ఫోకస్ నిలపనుంది. ఆమె నటించిన మరో పెద్ద చిత్రం… బీస్ట్. విజయ్ సరసన నటించింది. తమిళనాట విజయ్ కున్న క్రేజ్ వేరు. అతనిప్పుడు అక్కడ ఆల్మోస్ట్ నంబర్ 1 హీరో. సో, ‘బీస్ట్’ సినిమా మీద మంచి నమ్మకం, ఆశలు పెట్టుకుంది పూజ హెగ్డే.
‘బీస్ట్’ వచ్చే నెల 14న విడుదల కానుంది. ఈ సినిమాలోని మొదటి పాట బాగా వైరల్ అయింది. దాంతో, ‘బీస్ట్’కి ఎక్కువ డేట్స్ ఇచ్చింది ప్రొమోషన్ కోసం.
పూజ హెగ్డే నటించిన మరో తెలుగు పెద్ద చిత్రం ‘ఆచార్య’ కూడా వచ్చే నెలలోనే విడుదల కానుంది. కానీ, ఆమె అందులో మెయిన్ హీరోయిన్ కాదు. గెస్ట్ రోల్. సో, హీరోయిన్ గా ఆమెకి అసలు క్రేజ్ దక్కేది మాత్రం ‘బీస్ట్’తోనే.
ALSO CHECK: Pooja Hegde’s pose at Park Hyatt