కాన్స్ లో ముద్దుగుమ్మల మెరుపులు

మరోసారి కాన్స్ ఫిలింఫెస్టివల్ సిద్ధమైంది. ఈసారి ప్రత్యేకత ఏంటంటే.. కరోనా వల్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఈ చిత్రోత్సవం జరుగుతోంది. ఎప్పట్లానే ఈసారి తారల తళుకుబెళుకులు ఉన్నాయి. ఇందులో కూడా  ఓ ప్రత్యేకత ఉంది. ఎప్పుడూ బాలీవుడ్ నుంచి మాత్రమే ప్రాతినిధ్యం ఉండేది. ఈసారి సౌత్ నుంచి కూడా మెరుపులు బాగానే ఉన్నాయి.

మిల్కీబ్యూటీ తమన్న ఆల్రెడీ కాన్స్ కు చేరుకుంది. రెడ్ కార్పెట్ పై ఆమె క్యాట్ వాక్ చేయబోతోంది. ఈ మేరకు ఆమె కొన్ని ఫొటోలు కూడా షేర్ చేసింది. మరో హీరోయిన్ పూజా హెగ్డే కూడా కాన్స్ కు చేరుకుంది. ఆమె కూడా కాస్ట్ లీ డిజైనర్ డ్రెస్ లో మెరవబోతోంది. ఇక కమల్ హాసన్, తన కొత్త సినిమా విక్రమ్ ట్రయిలర్ ను కాన్స్ లో లాంఛ్ చేయబోతున్నారు.

వీళ్లతో పాటు ప్రతి ఏటా కాన్స్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఐశ్యర్యరాయ్ కూడా ఈ ఏడాది మెరవనుంది. ఇప్పటికే కూతురు, భర్తతో కలిసి కాన్స్ కు చేరుకుంది. అటు దీపిక పదుకోన్, ప్రియాంక చోప్రా లాంటి ముద్దుగుమ్మలు కూడా కాన్స్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనున్నారు. దీపిక పదుకోన్, జ్యూరీ సభ్యురాలిగా కాన్స్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. గర్భందాల్చడంతో ఈ ఏడాది సోనమ్ కపూర్, కాన్స్ కు దూరమైంది.

 

More

Related Stories