బుట్టబొమ్మ బర్త్ డే స్పెషల్!

Pooja Hegde

కెరీర్ స్టార్టింగ్ లో నాగచైతన్య సరసన నటించింది పూజా హెగ్డే. ఇప్పుడు కెరీర్ మంచి పీక్ స్టేజ్ లో ఉన్న టైమ్ లో అఖిల్ తో సినిమా చేస్తోంది. ఇలా అన్నదమ్ములిద్దర్నీ కవర్ చేసిన ఈ బ్యూటీ.. అన్న కంటే తమ్ముడితోనే ఎక్కువ రొమాన్స్ చేసిందనే టాక్ వినిపిస్తోంది.

నాగచైతన్యతో చేసిన “ఒక లైలా కోసం” సినిమాలో పద్ధతిగా కనిపించింది పూజ. పైగా కథ ప్రకారం అందులో హీరోహీరోయిన్ల మధ్య ఎలాంటి రొమాంటిక్ సీన్స్ పెట్టడానికి కుదరలేదు. కానీ ప్రస్తుతం అఖిల్ తో చేస్తున్న “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” మాత్రం అలా కాదంట.

ఈ సినిమాలో అఖిల్-పూజా మధ్య ఘాటు రొమాన్స్ జరిగినట్టు తెలుస్తోంది. అంతేకాదు.. దీనికి సంబంధించి ఓ స్టిల్ కూడా ఆమధ్య రిలీజైంది. అఖిల్ సీరియస్ గా వర్క్ చేస్తుంటే.. వెనక వైపు నుంచి తన కాలి వేళ్లతో అఖిల్ ను పూజా డిస్టర్బ్ చేస్తుంటుంది.

'Most Eligible Bachelor' movie still

ఆ స్టిల్ అప్పట్లో బాగా వైరల్ అయింది. ఇప్పుడు అలాంటిదే మరో స్టిల్ ను రేపు రిలీజ్ చేసే ఆలోచనలో ఉందట యూనిట్. ఎందుకంటే రేపు ఈ బుట్టబొమ్మ బర్త్ డే. ఈ సందర్భంగా “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” నుంచి పూజా హెగ్డే స్టిల్ ను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరి “రాధేశ్యామ్” యూనిట్ నుంచి ఏమైనా ఉంటుందా ఉండదా..?

Related Stories