పూజకే మళ్ళీ ఛాన్స్?

Pooja Hegde

భారతీయ చిత్రసీమ అంతా పూజ హెగ్డే పేరును కలవరిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ… అన్ని సినిమా రంగాల్లోనూ ఆమెకి క్రేజ్ పెరుగుతోంది. ఇప్పటికే తమిళ సూపర్ స్టార్ విజయ్ కొత్త సినిమాలో పూజ నటించనుందని వార్తలు వచ్చాయి. లేటెస్ట్ గా ఎన్టీఆర్ కొత్త సినిమాలో కూడా పూజ హెగ్డే హీరోయిన్ పేరే వినిపిస్తోంది మరి.

పూజ హెగ్డే, ఎన్టీఆర్ ఇప్పటికే “”అరవింద సమేత”లో జంటగా నటించారు. త్రివిక్రమ్ వెంటనే ఆమెకి సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. “అలా వైకుంఠపురంలో” హీరోయిన్ గా తీసుకున్నాడు. ఆ సినిమా సంచలన విజయం సాధించింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కూడా ఆమెనే రిపీట్ చేస్తాడనేది లేటెస్ట్ బజ్.

ఇంతకుముందు ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్, కియారా అద్వానీ వంటి బాలీవుడ్ హీరోయిన్ల కోసం ప్రయత్నించారు. మరి ఇప్పుడు పూజ హెగ్డెనే ఎందుకు రిపీట్ చెయ్యాలనుకుంటున్నారో?

ఎన్టీఆర్ ప్రస్తుతం “ఆర్ ఆర్ ఆర్” షూటింగ్ లో ఉన్నాడు. క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయ్యాకే, ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా షురూ చేస్తాడు.

More

Related Stories