బికినిలో డ్యాన్స్ చేసిన పూజ


మాల్దీవుల్లో పూజ హెగ్డే చాలా ఎంజాయ్ చేసింది. ఆమె ఇంకా ఆ వెకేషన్ హ్యాంగోవర్ లోనే ఉంది. ఇండియాకి తిరిగొచ్చిన తర్వాత కూడా ఆమె మాల్దీవుల ట్రిప్ కి సంబందించిన ఫొటోలే అప్డేట్ చేస్తోంది.

అక్కడ ఉన్నప్పుడు బికినీల్లో ఫోజులు ఇచ్చింది. ఆ ఫోటోలు షేర్ చేసింది. తాజాగా బికినీపైన షర్ట్ వేసుకొని డ్యాన్స్ చేస్తున్న ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలను చూస్తుంటేనే తెలుస్తోంది ఆమె ఆ ట్రిప్ ని ఎంజాయ్ చేసిందో.

ఐతే, మాల్దీవుల ట్రిప్ కూడా ఒక కమర్షియల్ యాక్టివిటీనే. ఒక రిసార్ట్ కి అడ్వర్టైజ్ మెంట్ కోసం ఆమె ఈ ట్రిప్ కి వెళ్ళింది. మొత్తం ట్రిప్ ఖర్చులు ఆ రిసార్ట్ భరించింది. వెకేషన్ కి వెకేషన్, డబ్బుకి డబ్బు. అందుకే, పూజ హెగ్డే ఇంకా ఆ ట్రిప్ ని ప్రోమోట్ చేస్తోంది.

Also Check: Pooja Hegde loves ‘beach life’

ఇక ఆమె మహేష్ బాబు – త్రివిక్రమ్ కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొనాలి. విజయ్ హీరోగా రూపొందుతోన్న ‘బీస్ట్’ షూటింగ్ కూడా చెయ్యాలి. ‘రాధేశ్యామ్’, ‘ఆచార్య’ సినిమాలు మాత్రం వచ్చే ఏడాది ప్రారంభంలోనే విడుదల కానున్నాయి.

Advertisement
 

More

Related Stories