పూజ హిందీ సినిమా వాయిదా!

పూజ బాలీవుడ్ చిత్రాలన్నీ వాయిదాల బాట పడుతున్నాయి. గతేడాది విడుదల కావాల్సిన ‘సర్కస్’ అనే సినిమా నిరవధికంగా వాయిదా పడింది. రణవీర్ సింగ్ హీరోగా, పూజ హెగ్డే హీరోయిన్ గా రోహిత్ శెట్టి తీసిన ఈ సినిమా కొత్త విడుదల తేదీ ఇంకా ఫిక్స్ కాలేదు. ఇప్పుడు మరో సినిమా కూడా వాయిదా పడింది.

ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల కావల్సిన ‘కిసి కా భాయ్ కిసి కి జాన్’ కూడా వచ్చే సమ్మర్ కి వాయిదా పడినట్లు సమాచారం. ‘టైగర్ 3’ అనే సినిమాని వచ్చే రంజాన్ నుంచి వచ్చే ఏడాది దీపావళికి వాయిదా వేశారు. దాంతో, రంజాన్ కి ‘కిసి కా భాయ్ కిసి కి జాన్’ని మార్చినట్లు సమాచారం.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లోనే ఉంది పూజ హెగ్డే. ఇందులో ఆమె వెంకటేష్ కి సోదరిగా, సల్మాన్ ఖాన్ కి ప్రియురాలిగా నటిస్తోంది. జగపతి బాబు విలన్ గా నటిస్తున్నారు. ఈ ఏడాది పూజ హెగ్డేకి అన్నీ అపశకునాలే. ‘ఆచార్య’, ‘రాధే శ్యామ్’ ఫ్లాప్ అయ్యాయి. ‘జనగణమన’ ఆగిపోయింది. సల్మాన్ ఖాన్ సినిమా విడుదలయి కొంచెం ట్రాక్ మారుస్తుందేమో అనుకొంది. కానీ ఈ మూవీ వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయింది.

పూజ హెగ్డే ఇప్పటివరకు తెలుగులో ఒప్పుకున్న చిత్రం ఒక్కటే. అదే మహేష్ బాబు – త్రివిక్రమ్ మూవీ.

 

More

Related Stories