పూజాకి ఇష్టమైనది ఇదే

Pooja Hegde

”ఒక లైలా కోసం” సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే. కానీ అది ఆమె కెరీర్ స్పెషల్ మూవీ కాదంట. ఇక ”అల వైకుంఠపురములో” సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకుంది పూజ. అయితే అది కూడా ఆమెకు ఇష్టమైన సినిమా కాదట. మరి ఈ బుట్టబొమ్మకు ఇష్టమైన సినిమా ఏంటో తెలుసా?

పూజా హెగ్డేకు తన కెరీర్ లో ఇష్టమైన మూవీ ”అరవింద సమేత”. అవును.. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆ సినిమా తనకు వెరీ వెరీ స్పెషల్ అంటోంది. ఎన్టీఆర్ తో ఫస్ట్ టైమ్ వర్క్ చేయడం మెమొరబుల్ ఎక్స్ పీరియన్స్ అన్న పూజా హెగ్డే.. ఆన్-స్క్రీన్, ఆఫ్-స్క్రీన్ కూడా ఆ సినిమా తనకు చాలా నేర్పించిందని చెబుతోంది.

ఎందుకంటే.. ఈ సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది. పైగా టైటిల్ కూడా ఫిమేల్ సెంట్రిక్. ఈ సినిమా చేసే ప్రాసెస్ లో నటిగా చాలా ఎదిగానని, ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నానని, అందుకే ”అరవింద సమేత” సినిమా తన కెరీర్ లో ఎప్పటికీ వెరీ స్పెషల్ మూవీ అని చెబుతోంది పూజా హెగ్డే.

Related Stories