
పూజ హెగ్డే అందానికి మారుపేరు. ఆమె తన సోయగాల షోతోనే క్రేజ్ తెచ్చుకొని…ఇపుడు నంబర్ వన్ పొజిషన్ లో ఉంది. ఐతే, ఆ అందానికి కూడా మైంటైన్ నెన్స్ అవసరం. ఫిట్ గా ఉండాలంటే చాలా కష్టపడాలి. ఎన్నో కసరత్తులు చెయ్యాలి.
అందాల బుట్టబుమ్మ ఎక్సర్ చేసే ఫోజులు కూడా అందమే. అందుకే, ఆమె లేటెస్ట్ గా పోస్ట్ చేసిన జిమ్ వీడియో బాగా వైరల్ అయింది. జిమ్ లో వేగంగా కసరత్తులు చెయ్యొద్దంట. నిదానంగా చేస్తేనే ఫలితం ఉంటుంది అని చెప్తోంది. తన ట్రైనర్ తో కలిసి స్లో మూమెంట్స్ తో ఎక్సర్ సైజులు చేస్తోంది ఈ వీడియోలో.
31 ఏళ్ల సుందరికి ప్రస్తుతం షూటింగ్ లు లేవు. దాంతో ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టింది.
ఆమె నటించిన రెండు చిత్రాలు … ‘రాధే శ్యామ్’, ‘ఆచార్య’ విడుదల కావాలి. సంక్రాంతికి విడుదల కావాల్సిన ‘రాధేశ్యామ్’ వాయిదాపడింది. ‘ఆచార్య’ కూడా అదే బాటలో వెళ్లే అవకాశం ఉంది. తమిళంలో ఆమె విజయ్ సరసన ‘బీస్ట్’ అనే మూవీ చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ మొత్తం అయిపోయింది. ఇక, మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీసే కొత్త సినిమా షూటింగ్ మొదలు కావడానికి చాలా టైం పట్టేలా ఉంది. పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ సినిమా కూడా అంతే. అందుకే, ఆమె ఇప్పుడు షూటింగ్ లు లేక ఖాళీగా ఉంది.