పూజకి మరో పరీక్ష

వరుస అపజయాలతో పూజ హెగ్డే క్రేజ్ మొత్తం పోయింది. ఒకప్పుడు ఆమెది గోల్డెన్ లెగ్ అని మురిసిపోయారు నిర్మాతలు. కానీ ‘ఆచార్య’, ‘రాధే శ్యామ్’, ‘బీస్ట్’, ‘సర్కస్’ … వరుసగా నాలుగు సినిమాలు బోల్తా కొట్టేసరికి ఆమె వల్ల సినిమాలకు కలిసొచ్చేది పెద్దగా లేదని ఫిక్స్ అయ్యారు మేకర్స్. ఇప్పుడు ఆమె తన రాతని మార్చుకోవాలి.

ఐతే, ఇప్పుడు మళ్ళీ ఆమె ఇంకో పరీక్ష ఎదుర్కోనుంది. ఆమె సల్మాన్ ఖాన్ సరసన నటించిన “కిసి కా భాయి, కిసి కి జాన్” (Kisi Ka Bhai Kisi Ki Jaan) చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమా పాటల ప్రొమోషన్ మొదలైంది. ఈ సినిమా అయినా ఆమెకి కలిసొస్తుందా లేదా అనేది చూడాలి. షారుక్ ఖాన్ నటించిన ‘పఠాన్’ సినిమాలో సల్మాన్ ఖాన్ గెస్ట్ గా నటించాడు. ఆ విధంగా సల్మాన్ తన ఫ్లాపులకు ఎండ్ కార్డు వేసుకున్నాడు.

మరి పూజకి “కిసి కా భాయి, కిసి కి జాన్” కలిసొస్తుందా లేక ఆమె ఖాతాలో ఇంకో ఫ్లాప్ గా చేరుతుందా?

ప్రస్తుతం పూజ హెగ్డే చేతిలో ఒక్క మహేష్ బాబు – త్రివిక్రమ్ చిత్రం మాత్రమే ఉంది. ఆమె డేట్స్ ఖాళీగానే ఉన్నాయి. కానీ, దర్శక, నిర్మాతలు మునుపటిలా ఆమె డేట్స్ కోసం ఎగబడడం లేదు.

 

More

Related Stories