
పెద్ద సినిమాల్లో హీరోయిన్లు మరీ కరివేపాకుల్లా మారిపోతున్నారు. రొమాంటిక్ సన్నివేశాలకు, పాటలకు తప్ప వారికి ప్రాధాన్యం ఉండటం లేదు. “ఆర్ ఆర్ ఆర్” వంటి సినిమాల్లో వాటికి కూడా నోచుకోలేదు అనుకొండి. మొత్తమ్మీద, భారీ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలే కాదు, వారికుండే స్పేస్ కూడా తక్కువ అవుతోంది.
విజయ్ హీరోగా నటించిన “బీస్ట్” సినిమా ట్రైలర్ వచ్చింది. ఈ ట్రైలర్ లో పూజ హెగ్డే 2 సెకండ్ల పాటే కనిపించింది. దాదాపు మూడు నిమిషాల పాటు ఉన్న ఈ ప్రోమోలో ఆమెకి అంత తక్కువ స్పేస్. మరి సినిమాలో అయినా చెప్పుకోదగ్గ పాత్ర ఉంటుందా అనేది చూడాలి. ఇప్పటికే ఆమెపై చిత్రీకరించిన రెండు పాటలు బయటికి వచ్చాయి.
పూజ హెగ్డే కెరీర్ ప్రారంభంలో తమిళ చిత్రాలు చేసింది కానీ విజయం దక్కలేదు. తెలుగులో నంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగాక ఆమె మళ్ళీ తమిళ చిత్రసీమలో అడుగుపెడుతోంది. విజయ్ వంటి పెద్ద హీరోతో జోడి అంటే ఆటోమేటిక్ గా తమిళంలో క్రేజ్ వస్తుంది. మరి తమిళంలో కూడా ఆమె నంబర్ వన్ అవుతుందా అనేది ఈ సినిమాకి వచ్చే రిజల్ట్ ని బట్టి చెప్పొచ్చు.
పూజ హెగ్డే నటించిన ‘ఆచార్య’ కూడా ఈ నెలలోనే విడుదల కానుంది.